Lakshmi Parvathi: మరో 30 ఏళ్లు ఏపీలో జగనే సీఎం

Lakshmi Parvathi:

Samba Siva Rao
Updated on: 14 March 2021 3:30 PM IST
Lakshmi parvathi
X

లక్ష్మి పార్వతి (ఇమేజ్ సోర్స్ Thehansindia)

Lakshmi Parvathi: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతీ. టీడీపీని చంద్రబాబు భ్రష్టుపట్టించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. మున్సిపాల్, కర్పోరేషన్‌ ఎన్నికలతో ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయ్యిందని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఆమె ఎద్దేవా చేశారు. ఇంకా 30 ఏళ్లపాటు జగన్ పరిపాలన కొనసాగుతుందని లక్ష్మీపార్వతి ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. విశాఖ, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ కడప, అనంతపురం జిల్లాల్లో మాత్రమే విజయం సాధించింది. తాడిపత్రి మున్సిపాటీని టీడీపీ కైవసం చేసుకుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story