Lakshmi Narayana: కళ్లు తిరిగి పడిపోయిన మాజీ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ

Lakshmi Narayana: సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్న క్రమంలో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ కళ్లుతిరిగి పడిపోయారు

Sandeep Eggoju
Published on: 10 Dec 2021 6:04 PM IST
Lakshmi Narayana is felt Sick on the CID Rides
X

హైబీపీతో సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మీనారాయణ(ఫైల్-ఫోటో)

Lakshmi Narayana: సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్న క్రమంలో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ కళ్లుతిరిగి పడిపోయారు. ఉదయం నుంచీ తనిఖీలు జరుగుతున్న నేపధ్యంలో హైబీపీతో ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయారు. దీంతో డాక్టర్‌ను ఇంటికే పిలిపించిన సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించిన స్టార్ ఆస్పత్రి వైద్యులు లక్ష్మీనారాయణను ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో లక్ష్మీనారాయణను బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story