Visakhapatnam: మృతదేహాలను దహనం చేసేందుకు కట్టెల కొరత

Visakhapatnam: విశాఖలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 26 April 2021 6:21 PM IST
Lack of Firewood for Cremation in Visakhapatnam
X

Visakhapatnam: మృతదేహాలను దహనం చేసేందుకు కట్టెల కొరత

Visakhapatnam: విశాఖలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. కరోనా మృతదేహాలతో అంబులెన్స్‌లు స్మశానవాటికకు క్యూకడుతున్నాయి. అయితే, మృతదేహాలను దహనం చేసేందుకు కట్టెల కొరత ఏర్పడటంతో దహన సంస్కారాల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దాంతో, అంబులెన్స్‌ల్లోనే మృతదేహాలు ఉండిపోతున్నాయి. పైగా, కట్టెలకు విపరీతంగా డిమాండ్‌ పెరగడంతో ఒక్కో లోడ్‌కు 7వేల రూపాయలను డిమాండ్ చేస్తున్నారు వ్యాపారులు. దాంతో, పచ్చి కర్రలతో దహన సంస్కారాలను నిర్వహిస్తున్నారు. అయితే, అసంపూర్తిగా కాలిన కరోనా మృతదేహాలను అలాగే వదిలేస్తుండటంతో స్మశానవాటిక పరిసర ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story