అబ్బాయికి 19.. ఆమెకు 26.. పెళ్లైన మూన్నాళ్లకే..

అబ్బాయికి 19.. ఆమెకు 26.. పెళ్లైన మూన్నాళ్లకే..
x
Highlights

Woman stages dharna in front of husband's house: ఆ అబ్బాయి వయసు 19, ఆమెకు 26ఏళ్లు. కాగా ఇద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా...

Woman stages dharna in front of husband's house: ఆ అబ్బాయి వయసు 19, ఆమెకు 26ఏళ్లు. కాగా ఇద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంటికి వెళ్లి వస్తానంటూ చెప్పిన అబ్బాయి తిరిగి రాలేదు. దీంతో యువతి అతడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. ఈ ఘటన నందవరం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

నందవరం మండల కేంద్రానికి చెందిన రాకేష్‌ గౌడ్‌కు ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌కు చెందిన అనూష పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం గత నెల 4న ఇద్దరూ హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టారు. 15 రోజుల తరువాత స్వగ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి రాకేష్‌ నందవరానికి వచ్చాడు. వారం రోజుల నుంచి ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో యువతి ఆందోళన చెంది నందవరం చేరుకుంది. నందవరంలో శుక్రవారం భర్తను చూద్దామని ఆమె వచ్చారు. అయితే భర్త, అతడి తల్లిదండ్రులు నిరాకరించడంతో న్యాయం జరిగే వరకు వెళ్లనంటూ ఇంటి ఎదుట బైఠాయించారు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలి అంటూ మహిళ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఎస్సై నాగరాజు, సిబ్బంది వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories