Kurasala Kannababu: చంద్రబాబు కోసమే పార్టీ పెట్టిన వ్యక్తి పవన్..

Kurasala Kannababu: టీడీపీకి అనుబంధంగా జనసేన ఉంటుందన్నారు మంత్రి కన్నబాబు.

Arun Chilukuri
Updated on: 15 March 2022 5:31 PM IST
Kurasala Kannababu Slams Pawan Kalyan
X

Kurasala Kannababu: చంద్రబాబు కోసమే పార్టీ పెట్టిన వ్యక్తి పవన్..

Kurasala Kannababu: టీడీపీకి అనుబంధంగా జనసేన ఉంటుందన్నారు మంత్రి కన్నబాబు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ కి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని కన్నబాబు అన్నారు. ప్రజలకు మేలు చేస్తామని ఆపార్టీ నేత ఎప్పుడూ చెప్పరు.. జగన్ ని ఓడిస్తామనీ, చంద్రబాబుని గెలిపిస్తామనీ అంటుంటారు అంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కోసమే పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ అని అన్నారు. బీజేపీని కూడా టీడీపీతో కలిపి వెళ్లాలని పవన్ ప్లాన్ అన్నారు. తన పార్టీ అభివృద్ధి కన్నా చంద్రబాబు బాగు చూసే వ్యక్తి పవన్ అని అన్నారు. చంద్రబాబు, పవన్ వల్ల రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story