KS Jawahar Reddy: ఏపీ నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం

KS Jawahar Reddy: ఏపీ నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం

Arun Chilukuri
Published on: 29 Nov 2022 4:57 PM IST
KS Jawahar Reddy New AP Chief Secretary
X

KS Jawahar Reddy: ఏపీ నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం

KS Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్ నూతన ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. జవహర్‌ రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఛీఫ్ సెక్రటరీగా ఉన్న సమీర్ శర్మ నవంబర్ 30న రిటైర్ కానున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసినా..ప్రభుత్వం మరో ఆరునెలలు పొడిగించింది. మరోసారి పొడిగించేందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో రిటైర్మెంట్ అనివార్యమైంది. ఆయన స్థానంలో కేఎస్ జవహర్ రెడ్డి ఛీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. జవహర్‌ రెడ్డి ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సీఎం జగన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story