ప.గో జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ

Krishna Raja Commemorative Event on Mogalturu | Telugu News
x

ప.గో జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ

Highlights

*కుటుంబ సభ్యులను పరామర్శించిన.. మంత్రులు రోజా, చెల్లబోయిన వేణు

Mogalturu: రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఘనంగా జరిగింది. పదేళ్ల తర్వాత ప్రభాస్, కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి రావడంతో స్థానిక ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. స్మారక కార్యక్రమానికి భారీ ఎత్తున స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. వచ్చిన వారిని ప్రభాస్ పలకరించి, అభివాదాలు తెలిపారు.

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సభకు, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రోజా, ప్రభుత్వ విప్ మధునూరి ప్రసాదరాజు హాజరై.. కుటుంబసభ్యులను పరామర్శించారు. కృష్ణం రాజు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా రెండు ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని నేతలు తెలిపారు. రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత కృష్ణం రాజుకే దక్కుతుందని వారు కొనియాడారు.


Show Full Article
Print Article
Next Story
More Stories