ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇకపై ఓట్లు మనవే సీట్లు మనవే..

Kotamreddy Sridhar Reddy Comments on Anam Family
x

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇకపై ఓట్లు మనవే సీట్లు మనవే..

Highlights

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తన గొంతు నొక్కేందుకు కుట్ర జరిగిందని.. కొన్ని సంపన్న కుటుంబాలు తనను అణగదొక్కేందుకు ప్రయత్నించాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఆ కుటుంబాల వారే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కొనసాగాలని... సామాన్యులను ఎదగనివ్వరని చెప్పారు. తాను ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తినని.. తన స్వశక్తితో ఎమ్మెల్యేగా ఎదిగానని తెలిపారు.. ఇకపై ఓట్లు మనవే సీట్లు మనవే అంటూ పవర్ ఫుల్ పంచ్ వేశారు. అయితే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నెల్లూరులో రాజకీయ చర్చకు తెరతీశాయి. శ్రీధర్ రెడ్డి... ఆనం కుటుంబాన్ని ఉద్దేశించే హాట్ కామెంట్స్ చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories