AP News: టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

AP News: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 24 March 2023 4:56 PM IST
Kotamreddy Giridhar Reddy Join in TDP
X

AP News: టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

AP News: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. గిరిధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వచ్చారు. 2023లో 23వ తేదీన 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం దేవుడి అసలైన స్క్రిప్ట్ అని అభివర్ణించారు. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రమంతా గెలుస్తుందన్న చంద్రబాబు.. గిరిధర్ రెడ్డిలాంటి వారు పార్టీలోకి రావడంవల్ల పార్టీ బలం ఇంకా పెరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని.. గిరిధర్ రెడ్డి లాంటి సేవాభావం ఉన్నవారే జగన్ పార్టీలో ఉండలేకపోతే, సామాన్యకార్యకర్తలు ఎలా ఉంటారని చంద్రబాబు ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story