Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదల కారణంగా రాకపోకలు నిలిపివేత..

Konaseema: గత నాలుగేళ్లుగా ప్రమాద పరిస్థితుల్లో ఏటిగట్టు

Shekhar G
Published on: 26 July 2023 7:19 PM IST
Konaseema District Due To Flood Travels Suspended
X

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదల కారణంగా రాకపోకలు నిలిపివేత..  

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలో కోటిపల్లి --ముక్తేశ్వరం వెళ్లేందుకు గోదావరి వరదలు కారణంగా రాకపోకలు నిలిపివేశారు. కోటిపల్లి నుంచి రావులపాలెం వెళ్లే ఏటిగట్టు కొంతమేర ప్రమాద పరిస్థితుల్లో ఉంది. దీంతో భారీ వాహనాలను కోటిపల్లి నుండి కె.గంగవరం మీదుగా.. పామర్రు నుంచి కపిలేశ్వరం వెళ్లేలా తగు చర్యలు తీసుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఏటిగట్టు ప్రమాద పరిస్థితుల్లో ఉంది. దానికి సపోర్టుగా కర్రలు కట్టి మధ్యలో ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి కాపాడుకుంటూ వస్తున్నారు. త్వరలో ఈ రేవుకు మరింత ముంపు పెరిగే అవకాశం ఉందని .. అక్కడి ప్రజలు భయపడుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story