తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Tirumala: ఏకాదశిని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా కార్యక్రమణ నిర్వహణ

Jyothi
Updated on: 27 Dec 2022 1:29 PM IST
Koil Alwar Thirumanjanam
X

Tirumala: జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని, తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. మూలవర్లకు ప్రాత:కాల పూజ కైంకర్యాలు, అరగింపులు అనంతరం గర్భాలయంలోని మూలమూర్తిని దవళవస్త్రంతో చుట్టారు. అనంతరం ఆలయం మొత్తం నీటితో శుభ్రం చేసి, పసుపు, రక్తచందనం, పచ్చకర్పూరం, శ్రీగంధం, పచ్చకర్పూరం, తదితర సుగంధ ద్రవ్యాలతో చేసిన లేహ్యాన్ని ఆలయం గోడలకు లేపనం చేసారు. అనంతరం నీటితో మళ్లీ శుద్ధి చేసి, మూలమూర్తికి చుట్టిన వస్త్రాని తొలిగించారు. అభిషేక పూజ కార్యక్రమాలు పూర్తి చేసి సామన్య భక్తులను దర్శనానికి అనుమతించారు.

Jyothi

Jyothi

Next Story