Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కార్యక్రమం

Jyothi
Published on: 19 Dec 2023 11:22 AM IST
Koil Alwar Thirumanjanam At Tirumala Temple
X

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించారు.మూలవర్లకు ప్రాత:కాల పూజ కైంకర్యాలు, అరగింపులు అనంతరం గర్బాలయంలోని మూలమూర్తిని దవళవస్త్రంతో చుట్టిన అనంతరం, ఆలయం మొత్తం నీటితో శుభ్రం చేశారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story