Vijayawada: రాహుల్ హత్యకు సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ్

Vijayawada Rahul Case: కారులోనే రాహుల్‌ను తాడుతో ఉరివేసి చంపినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

Shireesha
Updated on: 26 Aug 2021 2:45 PM IST
Koganti Satyam Korada Vijay Kumar Main Accused in Vijayawada Young Businessman Rahul Assassination Case | Live News
X

రాహుల్ హత్యకు సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ్

Vijayawada Rahul Case: విజయవాడ రాహుల్ హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హత్యకు సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ్ గా నిర్ధారించారు. కారులోనే రాహుల్‌ను తాడుతో ఉరివేసి చంపినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ఎత్తుగడలు వేసినట్లు సమాచారం. హత్య కోసం కొత్త ఫోన్‌లు, సిమ్‌లు బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

రెండు చోట్ల సెటిల్‌మెంట్‌కు యత్నించారని.. మాట వినకపోవడంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాహుల్ హత్యలో మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించారు. కోగంటి సమక్షంలో బలవంతంగా కంపెనీ షేర్లు మార్పిస్తూ పేపర్లపై సంతకాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాహుల్‌ను చంపేయాలన్న కోగంటి ఆదేశాలతో కారులో హత్య చేసినట్లు నిర్ధారించారు. సీసీ కెమెరాల పరిశీలనలో కోరాడ, కోగంటి కుట్రలు బయటపడ్డాయి. ఫోన్ డేటా, బ్యాంకు లావాదేవీలతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు వ్యాపార లావాదేవీలే ప్రధాన కారణంగా నిర్ధారించారు పోలీసులు.

Shireesha

Shireesha

Next Story