మంత్రి కొడాలి వ్యాఖ్యలను వక్రీకరించారు : మంత్రి బొత్స

మంత్రి కొడాలి వ్యాఖ్యలను వక్రీకరించారు : మంత్రి బొత్స
x
Highlights

విజయవాడ మధురానగర్‌లో ట్రాఫిక్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వెంటనే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం...

విజయవాడ మధురానగర్‌లో ట్రాఫిక్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వెంటనే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని వెల్లడించారు. రూ.17 కోట్ల ప్రభుత్వ నిధులు, రూ.10 కోట్ల రైల్వే నిధులతో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. 6 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాబోతోందని బొత్స స్పష్టం చేశారు. అమరవాతి శాసన రాజధాని అంశంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించ వద్దని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

అన్ని వర్గాలకూ చెందిన ప్రాంతంగా రాజధాని ఉండాలనేదే కొడాలి నాని ఉద్దేశం అన్నారు బొత్స. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వవొద్దనడం కరెక్టు కాదనీ... కొంత మందే రాజధానిలో ఉండాలనుకోవడం సరి కాదనేది నాని అభిప్రాయం అని బొత్స వివరణ ఇచ్చారు. అది నాని అభిప్రాయం మాత్రమే అన్నారు. శాసన రాజధానిని అమరావతి నుంచి తప్పిస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు కదా అని బొత్స అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందన్న ఆయన కొందరు కావాలనే ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు మంత్రి బొత్స. అదేవిధంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, విజయవాడ అభివృద్ధి పట్ల సీఎం కట్టుబడి ఉన్నారు. త్వరలోనే ఈ రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుంది. గత ప్రభుత్వంలో లాగా జగన్‌ మోహన్‌ రెడ్డి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు. కచ్చితంగా రాబోయే రోజుల్లో విజయవాడ అభివృద్ధి మరింతగా జరుగుతుంది అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories