మమ్ముల్ని జూనియర్ ఎన్టీఆర్ ఎలా కంట్రోల్ చేస్తారు.. మంత్రి కొడాలి నాని ఫైర్

Kodali Nani: చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 25 Nov 2021 2:02 PM IST
మమ్ముల్ని జూనియర్ ఎన్టీఆర్ ఎలా కంట్రోల్ చేస్తారు.. మంత్రి కొడాలి నాని ఫైర్
X

మమ్ముల్ని జూనియర్ ఎన్టీఆర్ ఎలా కంట్రోల్ చేస్తారు.. మంత్రి కొడాలి నాని ఫైర్

Kodali Nani: చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. తన భార్య పేరు చెబితే నందమూరి ఫ్యామిలీ మద్దతు ఇస్తుందని బాబు ప్లాన్ వేశారని కొడాలి నాని ఆరోపించారు. నందమూరి ఫ్యామిలీ అంటే తనకు, జగన్‌కు ఎంతో గౌరవమన్నారు. నందమూరి కుటుంబసభ్యులు అమాయకులున్నారాయన. గొర్రె కసాయిని నమ్మినట్లు చంద్రబాబును ఇంకా నందమూరి ఫ్యామిలీ నమ్ముతుందన్నారు.

ఎన్టీఆర్‌ మమ్మల్ని కంట్రోల్‌ చేయడం ఏంటని కొడాలి నాని ప్రశ్నించారు. ఒకప్పుడు నందమూరి కుటుంబంతో కలిసి ఉన్నామని.. విబేధాలతో బయటకు వచ్చామని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ చెబితే వింటాం కానీ.. జూనియర్ ఎన్టీఆర్ చెబితే వినేందేంటూ మంత్రి కొడాలి నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తమకేం సంబంధం లేదంటూ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story