Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌, భువనేశ్వరీలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు

Kodali Nani: జైలులో ఫ్రీజ్‌, కూలర్‌, ఏసీలు ఉండటానికి అది ఇల్లు కాదు

Shekhar G
Published on: 26 Sept 2023 4:05 PM IST
Kodali Nani Satires On Chandrababu Lokesh And Bhuvaneshwari
X

Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌, భువనేశ్వరీలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు

Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌, భువనేశ్వరీలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్‌ అయితే లోకేష్‌ తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తున్నాడని కొడాలి నాని విమర్శించారు. లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నాడని..కేసు పెట్టాల్సిన అవసరం లేదని కొడాలి నాని అన్నారు. రాత్రికి రాత్రికి 2వేల పేజీలతో మెమోలు ఎలా తయారు చేస్తారని ఆయన అన్నారు. లోకేష్‌ మా పేర్లు రెడ్‌ బుక్‌లో రాస్తున్నాడు.. మేం లోకేష్‌ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని మండిపడ్డారు. తన భర్తకు జైలులో వసతులు లేవని భువనేశ్వరీ గగ్గోలు పెడుతున్నారని ఆయన అన్నారు. జైలులో ఫ్రీజ్‌, కూలర్‌, ఏసీలు ఉండటానికి అది ఇల్లు కాదని కొడాలి నాని సెటైర్లు వేశారు. జైలులో వసతులు కావాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి ఉంటుందని కొడాలి నాని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story