పీక్స్‌కు చేరుకున్న ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం

Arun Chilukuri
Published on: 13 Feb 2021 4:12 PM IST
పీక్స్‌కు చేరుకున్న ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం
X

పీక్స్‌కు చేరుకున్న ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం

ఏపీ పంచాయతీ పోరు మరింత పీక్స్‌కు చేరుకుంది. ఆదేశాలు, ఫిర్యాదులతో ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ మంత్రుల మధ్య హీట్ మరింత రెట్టింపయింది. మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు సంచలనం కలిగించాయి. ఎన్నికల ప్రక్రియలో ఎస్ఈసీ విధులకు మంత్రి ఆటంకం కలిగించారని నిమ్మగడ్డ ఆరోపించారు. మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కృష్ణాజిల్లా ఎస్పీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు తనపై కేసు నమోదు చేయాలన్న నిమ్మగడ్డ ఆదేశాలపై మంత్రి కొడాలి నాని సీరియస్ అయ్యారు. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి తరహాలో ఎస్ఈసీపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే యోచనలో మంత్రి కొడాలి నాని ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివరణ ఇచ్చినా ఆంక్షలు, కేసు నమోదుకు ఆదేశాల ఇవ్వడంపై మంత్రి సీరియస్ అవుతున్నారు. అటు మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన నోటీసులపై రెండ్రోజుల్లో నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story