Kodali Nani: కొడాలి నాని హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై విచారణ ఈరోజు

*మ.2:15 గంటలకు ప్రారంభంకానున్న విచారణ *కొడాలి నాని వీడియో ఫుటేజీ ఫైల్ చేయమన్న హైకోర్టు *నేడు వీడియో ఫుటేజీ పరిశీలన

K V D Varma
Published on: 15 Feb 2021 8:30 AM IST
Kodali Nani house motion petition in high court
X

కొడాలి నాని (ఫోటో: హాన్స్ ఇండియా)

ఇవాళ హైకోర్టులో కొడాలి నాని హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారణ ప్రారంభంకానుంది. మరోవైపు ఎస్‌ఈసీ, కమిషన్‌పై మాట్లాడలేదని కొడాలి నాని తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే.. నాని వ్యాఖ్యలను వేరొకరి వ్యాఖ్యలతో పోల్చలేమని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. నాని మాట్లాడిన వీడియో ఫుటేజీ పరిశీలించాలని హైకోర్టును ఎస్‌ఈసీ తరపు న్యాయవాది కోరారు. కొడాలి నాని వీడియో ఫుటేజీ ఫైల్ చేయలేమని హైకోర్టు చెప్పగా.. వీడియో ఫుటేజీ తామే ఇస్తామని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో ఇవాళ వీడియో ఫుటేజీ పరిశీలించనున్నారు.

K V D Varma

K V D Varma

Next Story