చంద్రబాబు, ఎస్ఈసీ నిమ్మగడ్డలపై మంత్రి కొడాలి నాని విమర్శలు

X
Highlights
టీడీపీ అధినేత చంద్రబాబు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు....
Arun Chilukuri19 Nov 2020 2:19 PM GMT
టీడీపీ అధినేత చంద్రబాబు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఖాళీగా ఉంటూ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఇసుక దోపిడీ జరుగుతోందన్న చంద్రబాబు ఆరోపణలపై స్పందించిన మంత్రి దోచేయాలంటే బాబులా ఇసుక ఫ్రీ అని పెట్టేవాళ్లమని విమర్శించారు. గతంలో డ్వాక్రా మహిళల పేరుతో నదుల్లోని ఇసుకను టీడీపీ నేతలు దోచుకున్నారు కాబట్టే ఎన్జీటీ 100 కోట్లు ఫైన్ వేసిందని గుర్తు చేశారు. అటు ఏపీ ఎస్ఈసీ పైనా మంత్రి నాని తీవ్ర విమర్శలు చేశారు. నిమ్మగడ్డ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారో చంద్రబాబు తొత్తుగా ఉన్నారో ఆలోచించుకోవాలన్నారు. నిమ్మగడ్డ రాజ్యాంగ వ్యవస్థ ముసుగులో చంద్రబాబుకి పని చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Web Titlekodali Nani fires on Chandra babu and sec
Next Story