నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తులా పనిచేస్తున్నారు: కొడాలి నాని

Arun Chilukuri
Published on: 2 Jan 2021 5:14 PM IST
నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తులా పనిచేస్తున్నారు: కొడాలి నాని
X

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. రాజ్యాంగ పదవి లో వున్న వ్యక్తులు కులమతాలు, రాజకీయాలకు అతీతంగా పని చేయ్యలి కాని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అదేశాలు అమలు చేయ్యలన్న పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. కరోనా లాక్డౌన్ తో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందని మళ్ళీ ఇప్పుడు అదే ప్రక్రియ కొనసాగించాలని కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో కొడాలినాని పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story