నిమ్మగడ్డ రాజీనామా చేయాల్సిందే: కొడాలి నాని

X
Highlights
నిమ్మగడ్డ రమేష్‌పై మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. హైకోర్టు తీర్పు కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.....
Arun Chilukuri11 Jan 2021 1:28 PM GMT
నిమ్మగడ్డ రమేష్‌పై మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. హైకోర్టు తీర్పు కుక్క కాటుకు చెప్పు దెబ్బలా... నిమ్మగడ్డకు బుద్ది చెప్పిందన్నారు. ప్రభుత్వనికి చెడ్డ పేరు తేవాలని నిమ్మగడ్డ చూశారని ఆరోపించారు. నిమ్మగడ్డ బుద్ధి మార్చుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు వెంటపడి కొట్టే రోజులు వస్తాయన్నారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల కోసం పనిచేయాలని తెలిపారు. రిటైర్డ్ అయిన తర్వాత నిమ్మగడ్డ టీడీపీలో చేరుతారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా నైతిక బాధ్యతతో నిమ్మగడ్డ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతో వ్యాక్సినేషన్ క్యార్యక్రమంతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వం చూస్తోందని, త్వరలోనే కోవిడ్ వారియర్స్‌కి వ్యాక్సిన్ ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.
Web TitleKodali Nani Comments On EC Nimmagadda Ramesh Kumar
Next Story