Kodali Nani: చంద్రబాబు యమ రథంతో ప్రజలను చంపుతున్నారు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Kodali Nani Comments On Chandrababu
x

Kodali Nani: చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలవుతున్నారు

Highlights

Kodali Nani: చంద్రబాబు యమ రథంతో ప్రజలను చంపుతున్నారు

Kodali Nani: గుంటూరు తొక్కిసలాట ఘటనపై రియాక్టయిన మాజీ మంత్రి కొడాలి నాని ..చంద్రబాబు యమ రథంతో ప్రజలను చంపుతున్నారని ఫైర్ అయ్యారు. ఏడాది చివర ఎనిమిది మందినీ, ప్రారంభంలో ముగ్గురిని బలిగొన్నారని ఆరోపించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని కొడాలి నాని డిమాండ్ చేశారు.

మొదలు, చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి బుద్ధున్న వాళ్ళు ఎవరు వెళ్లరంటూ పేర్కొన్నారు. తమనేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని గగ్గోలు పెడతారన్నారు. నూటికి నూరు శాతం చంద్రబాబు పిచ్చితోనే మరణాలు సంభవించాయంటూ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories