Kodali Nani: గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

Kodali Nani: త్వరలో రాష్ట్రంలోని రోడ్ల సమస్య పరిష్కారం అవుతుంది

Shekhar G
Published on: 20 Nov 2023 6:37 PM IST
Kodali Nani Challenge to Chandrababu
X

Kodali Nani: గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

Kodali Nani: గుడివాడ అభివృద్ధిపై.. చంద్రబాబుకు సవాల్ విసిరారు కొడాలి నాని. గుడివాడలో ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు కొడాలి నాని. సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారన్నారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు..... 14ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని కొడాలి నాని నిలదీశారు. చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్ కు తాము చెప్పామని, ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం జగన్ చెప్పారన్నారు. త్వరలో రాష్ట్రంలోని రోడ్ల సమస్య పరిష్కారం అవుతుందన్నారు కొడాలి నాని.

Shekhar G

Shekhar G

Next Story