Top
logo

Kodali Nani: మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

Case Registered on Minister Kodali Nani
X

మంత్రి కోడలి నాని (ఫైల్ ఇమేజ్)

Highlights

Kodali Nani: చంద్రబాబు పై కొడాలి కామెంట్స్ కు కౌంటర్ గా తెలుగు తమ్ముళ్లు పోలీసులకు ఫిరాయదు చేశారు.

Kodali Nani: రాష్ట్రంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే దానిని పక్కనపెట్టి అధికార, విపక్షాల మధ్య రాజకీయ వైరస్ యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఒకరి పై మరొకరు కేసులు పెట్టుకుంటూ యుద్ధ వాతావరణాన్నికొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ వేరియంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలోని వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో టీడీపీ నేతలు మంత్రి సీదిరి అప్పల రాజుపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రాజకీయం వేడెక్కింది. దీంతో ఇటు టీడీపీ నేతలు, అటు వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

కరోనా వైరస్ వేరియంట్ ఎన్-440కే వైరస్ కర్నూలు పుట్టిందంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా ఈనెల 8న మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. కరోనా లాంటి వైరస్ ఏమైనా పుడితే గిడితే.. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టింది. దాని పేరు నారా కరోనా. సీబీఎన్ 420. 70 ఏళ్ళ క్రితమే అక్కడ పుట్టి, రాష్ట్రాన్ని నాశనం చేయటానికి నారా 420 వైరస్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి, చంద్రబాబుకు వేయాల్సింది కరోనా వ్యాక్సిన్ కాదు.. రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపైనే టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. కొడాలి కామెంట్స్ కు కౌంటర్ గా తెలుగు తమ్ముళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి వైరస్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె పంచాయతీ అయిన కందులవారిపల్లె గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి సహా వార్డు మెంబర్లంతా కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

నారా 420 వైరస్ నారావారిపల్లిలో పుట్టిందని అవమానకరంగా మాట్లాడడం బాధకరమన్నారు. చంద్రబాబు నాయుడు గురించి అవమానకరంగా మాట్లాడడమే కాకుండా నారావారిపల్లిలో 70 ఏళ్ల క్రితం నారా 420 వైరస్ పుట్టిందని గ్రామాన్నికించపరిచేలా మాట్లాడిన మంత్రి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారా వైరస్ అంటూ.. చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లి గ్రామస్థులను మనోభావాలను దెబ్బ తీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నకొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Web TitleKodali Nani: Case Registered on Minister Kodali Nani
Next Story