Vangalapudi Anitha: ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి

Vangalapudi Anitha: రాష్ట్రంలో ఇప్పటి దాకా నాలుగు హత్యలు జరిగాయి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 Aug 2024 4:46 PM IST
Killing politics is going on in AP Says Vangalapudi Anitha
X

Vangalapudi Anitha: ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి

Vangalapudi Anitha: ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి దాకా నాలుగు హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు టిడిపి నేతలే ఉన్నారన్నారు. కర్నూలులో టీడీపీ నేత శ్రీను హత్యా ఘటనను హోంమంత్రి తీవ్రంగా ఖండించారు. అనాగరికంగా హత్య చేశారని, దీనిపై కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడానన్నారు. నిందితుల్ని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షింస్తామని అనిత పేర్కొన్నారు. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. మృతుని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖలో పర్యటించిన హోం మంత్రి అనిత... ఆనంద గణపతి, సంపత్ వినాయక ఆలయాలను దర్శించుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story