పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కిడ్నాప్‌‌కు గురైన బాలుడు క్షేమం

*నెల్లూరు జిల్లా కావలి వద్ద బాలుడిని వదిలివెళ్లిన దుండగులు

Rama Rao
Published on: 3 Oct 2022 11:42 AM IST
Kidnap boy is safe in Chilakaluripet
X

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కిడ్నాప్‌‌కు గురైన బాలుడు క్షేమం

Palnadu: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో కిడ్నాప్‌కు గురైన రాజీవ్ సాయి క్షేమంగా బయటపడ్డాడు. నెల్లూరు జిల్లా కావలి వద్ద బాలుడిని దుండగులు కారులో వదిలివెళ్లారు. కావలి వద్ద రాజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావలి నుంచి బాలుడిని చిలకలూరిపేటకు తీసుకువస్తున్నారు. బాలుడి క్షేమ సమాచారం విన్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. రాజీవ్ సాయి తండ్రి చెన్నైలో దాన్యం వ్యాపారి. దసరా పండుగ కోసం రాజీవ్ సాయి కుటుంబం చిలకలూరిపేట వచ్చింది. ఈ క్రమంలో చిలకలూరిపేట 13వ వార్డులో దేవాలయంలో రాజీవ్ సాయి తల్లిదండ్రులు పూజలు చేస్తుండగా.. దేవాలయం వద్ద ఆడుకుంటున్న బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. కోటి రూపాయలు ఇవ్వాలంటూ కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రాజీవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా చివరకు రాజీవ్ సాయి క్షేమంగా దొరకడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story