ఐటీ ఉద్యోగి తనూజ కేసులో వీడుతున్న చిక్కుముడి

Tanuja: విజయవాడలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని తనూజ కేసులో చిక్కుముడి వీడుతుంది.

Arun Chilukuri
Published on: 22 Jan 2022 4:37 PM IST
key Update in Software Engineer Tanjua Death Case
X

ఐటీ ఉద్యోగి తనూజ కేసులో వీడుతున్న చిక్కుముడి

Tanuja: విజయవాడలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని తనూజ కేసులో చిక్కుముడి వీడుతుంది. తాజాగా అర్ధరాత్రి హైవేపై తనూజ నడుచుకుంటూ వెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాలో లభ్యమయ్యాయి. 16న రాత్రి 8.30 గంటల సమయంలో కుంచనపల్లి హైవేపై తనూజ ఒంటరిగా వెళ్లినట్టు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది.

ఈ నెల 16న తెనాలికి చెందిన స్నేహితుడికి ఫోన్ చేసిన తనూజ అతడి బైక్ పై వడ్డేశ్వరం దగ్గర దిగినట్టు గుర్తించారు. ఈ ఘటనలో తనూజకు ప్రమాదం జరిగి ఉంటుందని, ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తనూజ మరణించడంతో రోడ్డుపై పడేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసులో తనూజ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైవేపైన సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story