Viveka Murder Case: ఉదయ్ కుమార్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..

Viveka Murder Case: ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్‌రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారు- సీబీ

Jyothi
Updated on: 15 April 2023 12:53 PM IST
Key Points in Udaykumar Reddy Remand Report In Viveka Murder Case
X

Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో.... ఉదయ్‌కుమార్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు..

Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో.... ఉదయ్‌కుమార్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని.. హత్య తర్వాత ఉదయ్‌కుమార్‌రెడ్డి అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లాడని సీబీఐ తెలిపింది. గూగుల్‌ టేక్ ఔట్ లొకేషన్‌లో కూడా ఉదయ్‌కుమార్‌రెడ్డి అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలిందన్నారు. తన తండ్రి ప్రకాష్‌రెడ్డితో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారని... అవినాష్‌రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడని వెల్లడించారు.

వివేకా చనిపోయాడని తెలిసే వరకు ఇంట్లోనే ఉన్నారన్న సీబీఐ అధికారులు... వివేకా మృతి చెందాడనే వార్త తెలియగానే అవినాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారని తెలిపారు. బాత్రూం నుండి డెడ్ బాడీని బెడ్‌రూమ్‌కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడని.. వివేక తలకు ఉన్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు.

Jyothi

Jyothi

Next Story