AP News: సీఎం సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ,జనసేన కీలక నేతలు

AP News: పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

Shashank Gullapelli
Published on: 19 April 2024 1:54 PM IST
Key Leaders Of TDP And Janasena Joined In YSRCP Party In The Presence Of CM Jagan
X

AP News: సీఎం సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ,జనసేన కీలక నేతలు 

AP News: కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గంలో 18వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం సమక్షంలో టీడీపీకి, జనసేనకు చెందిన పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు. సీఎం జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన నుంచి మాజీ మేయర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు... పిఠాపురం నుంచి ఇందిర, నెహ్రూ, ప్రసాద్, వైసీపీలో చేరారు. ఇక పెద్దాపురం నుంచి తోట సుబ్బారావు నాయుడు, ముత్యాల శ్రీనివాస్ పార్టీలో చేరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర బీసీ ప్రజా సంక్షేమ సమితి అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు సైతం పార్టీలో చేరారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story