Pattabhi: పట్టాభిపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్.. అరెస్టు చేయకపోతే..

Pattabhi: టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేయకపోతే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఏపీ పోలీసులు తెలిపారు.

Arun Chilukuri
Published on: 21 Oct 2021 9:01 PM IST
key Information in Pattabhi Remand Report
X

Pattabhi: పట్టాభిపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్.. అరెస్టు చేయకపోతే..

Pattabhi: టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేయకపోతే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఏపీ పోలీసులు తెలిపారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో పట్టాభి కొన్నాళ్లుగా ఉద్రేకం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే ఏపీలో దాడులు జరిగాయని వదిలేస్తే ఇది ఒక పోకడగా మారి సమాజంలో అశాంతి రేగుతుందని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు.

దీన్ని సాధారణ అంశంగా వదిలేయలేమని వదిలేస్తే మైలేజీ కోసం మరింతగా రెచ్చిపోయి కుల, మత, వర్గ విభేదాలకు దారి తీయొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులు, పోలీసులకు చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతోనే ఇలా తిట్లు తిట్టారని ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరిగిందని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని రాశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story