Manikanta: శ్వేతను ఏ ఇబ్బంది పెట్టలేదు.. సమస్యలు వస్తే సర్ధుకోవాలని చెప్పాను..

Manikanta: విశాఖ బీచ్‌లో శవమైతేలిన వివాహిత శ్వేతది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri
Published on: 26 April 2023 5:36 PM IST
Key Facts In The Visakha Swetha Case
X

Manikanta: శ్వేతను ఏ ఇబ్బంది పెట్టలేదు.. సమస్యలు వస్తే సర్ధుకోవాలని చెప్పాను..

Manikanta: విశాఖ బీచ్‌లో శవమైతేలిన వివాహిత శ్వేతది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అత్తింటి వేదింపులతోనే శ్వేత ఆత్మహత్య చేసుకుందని... తల్లి రమాదేవి ఆరోపిస్తున్నారు. కడుపుతో ఉన్నా హింసలు పెట్టారని అంటున్నారు. రోజు ఫోన్ చేసి అత్తింటో ఇబ్బందులు పెడుతున్నారని శ్వేత చెప్పేదని రమాదేవి చెబుతున్నారు. నెల రోజుల క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను బెదిరించారని తల్లి అంటోంది.

చిన్న, చిన్న సమస్యలు వస్తాయని.. సర్ధుకు పోవాలని శ్వేతతో చెప్పినట్లు భర్త మణికంఠ అంటున్నాడు. చాలా వరకు సద్ది చెప్పానని.. కనీసం కడుపులో ఉన్న బిడ్డకోసమైనా ఆలోచించి ఉంటే బాగుండేదని చెబుతున్నాడు. నిన్న ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని.. చాలా సార్లు మెసేజ్ చేసినా స్పందించేదని అంటున్నాడు.

వివాహిత శ్వేత మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులంటున్నారు. మతదేహం మీద ఎలాంటి గాయాలు లేవని చెబుతున్నారు. పోర్టుమార్టం రిపోర్టు వస్తే దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story