YS Sharmila: షర్మిల కాంగ్రెస్ ఎంట్రీతో ఏపీలో కీలక పరిణామాలు?

Key Developments In AP With Sharmila Congress Entry
x

YS Sharmila: షర్మిల కాంగ్రెస్ ఎంట్రీతో ఏపీలో కీలక పరిణామాలు?

Highlights

YS Sharmila: KVP ద్వారా షర్మిలకు దగ్గరవ్వాలనే భావనలో నేతలు..?

YS Sharmila: షర్మిల కాంగ్రెస్ ఎంట్రీతో ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? చతికిల పడ్డ పార్టీకి ఏపీలో పునర్వైభవం రావాలంటే షర్మిల ఎంట్రీనే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ భావిస్తోందా..? తెలంగాణలో కీలక బాధ్యతలు ఇచ్చినా అది ఏపీపై ప్రభావం చూపేందుకేనా..? ప్రస్తుతం షర్మిల వేస్తున్న అడుగులతో ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ప్రశ్నలే రేకెత్తుతున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ డీలా పడింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితిలో ఉంది. దీంతో పార్టీకి పునర్వైభవం తీసుకొని రావాలంటే షర్మిల ప్రత్యామ్నాయంగా ఏఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో షర్మిల పెట్టిన పార్టీని విలీనం చేసుకుని.. తెలంగాణ ఎన్నికల అనంతరం షర్మిల ద్వారా ఏపీ ఎన్నికలపై ఫోకస్ పెంచాలనేది హస్తం పెద్దల అభిప్రాయమట. సీఎం జగన్‌పై పోరాటానికి ఆయన చెల్లి షర్మిలనే ఆయుధంగా మలచి.. రాజకీయ పోరుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అసమ్మతి నేతలు, సొంత సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకొచ్చేలా యాక్షన్ ప్లాన్ కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే KVPతో పలువురు వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారట. KVP ద్వారా షర్మిలకు దగ్గరవ్వాలనే భావనలోనే నేతలు ఆయన్ను కలుస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories