Andhra Pradesh: ప్లాస్టిక్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

*బట్టతో తయారుచేసిన ఫ్లెక్సీలే పెట్టాలని సీఎం జగన్ పిలుపు

Jyothi
Published on: 26 Aug 2022 12:26 PM IST
Key Decision of AP Government on Plastic
X

 Andhra Pradesh: ప్లాస్టిక్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం 

Andhra Pradesh: ప్లాస్టిక్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టు సీఎం జగన్‌ ప్రకటించారు. ఎక్కువ ధర అయినప్పటికీ బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలే పెట్టాలని సూచించారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్‌ నిషేధం అమలవుతోందని, దీనిద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు. 2027 నాటికి ప్లాస్టిక్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌గా అడుగులు పడాలని పిలుపునిచ్చారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story