Kesineni Nani: వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కేశినేని నాని

Kesineni Nani Sensational Coomments
x

Kesineni Nani: వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కేశినేని నాని

Highlights

Kesineni Nani: కేశినేని నాని వ్యాఖ్యలతో టీడీపీలో ప్రకంపనలు

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను, ప్రైజ్ మనీని అందించడానికి వెళ్లిన ఆయన తాజా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. జగన్ ఓడించాలంటే పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ఉండాలన్నారు. అలాగే దేవి నేని ఉమ, వసంత కృష్టప్రసాద్ లపై సెటైర్లు వేశారు.

టీడీపీ ప్రక్షాళన కావాలన్నదే తాను కోరుకుంటున్నానంటూ ఎంపీ కేశినేని అన్నారు. కేశినేని చిన్ని తోపాటు మరో ముగ్గురికి పార్టీ టిక్కెట‌ ఇస్తే వారికి తాను మద్దతు ఇవ్వనన్నారు. వారికి టిక్కెట్ ఇస్తే పార్టీ సిద్ధాంతాలు మంటగలిసినట్టే నన్నారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయంతో టీడీపీని స్థాపించారని, కాల్ మనీగాళ్లకి, ల్యాండ్ గ్రాబర్స్ టిక్కెట్ ఇస్తే పార్టీ పరువుపోతుందన్నారు. రియలెస్టేట్ మోసాలు, పేకాట క్లబ్బులు నడిపేవారికి తాను మద్దతు ఇవ్వనన్నారు.

కేశినేని నాని మరో సారి చెలరేగారు. ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలతో తనకు పనిలేదని, ఇండిపెండింటుగా నిలబడినా ప్రజలు గెలిపిస్తారన్నారు. తాను టీడీపీలో చేరిన తరువాత వైసీపీకి వలసలు ఆగాయన్నారు. తాను టాటా ట్రస్టుతో కలిసి అనేక సేవాకార్యక్రమాలు చేశానన్నారు. కొంత మంది వంద చీరలు పంచి దాన కర్ణుడులా కలరింగ్ ఇస్తున్నారని ఆరోపించార.

Show Full Article
Print Article
Next Story
More Stories