Kesineni Nani: నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Jyothi
Published on: 15 Jan 2023 7:02 PM IST
Kesineni Nani Sensational Comments
X

Kesineni Nani: నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రక్షాళన కావాలన్నదే తన కోరిక అని అన్నారు. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురికి టికెట్ ఇచ్చినా తన మద్దతు ఉండదన్నారాయన... కరప్షన్ కోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, తాను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదన్నారు. కేశినేని చిన్ని తనకంటే యాక్టివ్‌గా ఉంటే మంచిదేగా అని ఆయన అన్నారు. క్యారెక్టర్ ఉన్న ఏ పేదవాడికి టికెట్ ఇస్తే తాను మద్దతిస్తానని కేశినేని నాని చెప్పారు. కానీ ఛీటర్స్, ల్యాండ్ మాఫియా డాన్‌లు, రియల్టర్లు, మోసాలు చేసే వారికి, పేకాట క్లబ్‌లు నడిపే వారికి టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వనని చెప్పారు కేశినేని నాని.

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉందని, చార్లెస్ శోభరాజ్, దావూద్ ఇబ్రహీం, సెక్స్ రాకెట్, కాల్ మనీ చేసే వాళ్లు కూడా పోటీ చేసే హక్కు ఉందని ఎంపీ కేశినేని నాని అన్నారు. గాంధీ లాంటి మంచి వారికి సీటు ఇవ్వొచ్చని, దావూద్ ఇబ్రహీం లాంటి వారికి, లాండ్ గ్రాబర్లకు, ఉమెనైజర్‌కి ఇవ్వొచ్చన్నారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయంతో టీడీపీని స్థాపించారని, అదే ఆశయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను ఢిల్లీ స్థాయి నాయకుడినని, తన సేవలు పార్టీ కావాలంటే పార్టీ వాడుకోవచ్చన్నారాయన... తనకు ఒక బ్రాండ్ ఉందని, ఎంపీనీ కాకపోతే టాటా ట్రస్ట్ లాంటివి తెచ్చి సేవ చేస్తానన్నారు.

Jyothi

Jyothi

Next Story