Kesineni Nani: దుమారం రేపుతున్న ఎంపీ కేశినేని నాని వ్యవహారం

*విజయవాడలోని కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫ్లెక్సీల తొలగింపు *చంద్రబాబు, ఇతర నేతల ఫోటోల స్థానంలో రతన్ టాటా ఫోటోలు ఏర్పాటు

Shilpa
Published on: 18 Oct 2021 12:28 PM IST
Kesineni Nani Removed the Chandrababu Naidu Flexis at Kesineni Bhavan in Vijayawada
X

కేశినేని నాని - చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Kesineni Nani: టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ మరోసారి ఆసక్తికరంగా మారింది. విజయవాడలోని కేశినేని భవన్‌లో బయట గోడకు పెట్టిన చంద్రబాబు ఫ్లెక్సీని తొలగించారు. అదే స్థానంలో రతన్ టాటాతో కలిసి ఉన్న తన ఫోటోను ఏర్పాటు చేశారు. కేశినేని భవన్ వెలుపల ఏర్పాటు చేసిన తన పార్లమెంటరీ స్థానం పరిధీలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్య నాయకుల ఫోటోలను కూడా తొలగించారు. టాటా ట్రస్ట్, తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటోలను ఉంచారు. ప్రస్తుతం కేశినేని నాని ఫ్లెక్సీలను తొలగించడం ఆసక్తికరంగా మారింది.

Shilpa

Shilpa

Next Story