సొంత పార్టీ నేతకు కేశినేని నాని కౌంటర్.. చర్యలు తీసుకుంటారా అంటూ సవాల్..

Kesineni Nani: టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాంకు ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 9 Oct 2022 1:03 PM IST
Kesineni Nani Counter to Tdp Leader Nettem Raghuram
X

సొంత పార్టీ నేతకు కేశినేని నాని కౌంటర్.. చర్యలు తీసుకుంటారా అంటూ సవాల్..

Kesineni Nani: టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాంకు ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. తనను ఉద్దేశించి రఘురాం చేసిన పరోక్ష వ్యాఖ్యలకు సోషల్ మీడియా ద్వారా ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. కేశినేని నానిపై నెట్టెం రఘురాంకి తిరువూరుకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై స్పందనగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని రఘురాం చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్ట్ రుజువులతో సహా పంపిస్తామని, చర్యలు తీసుకుంటారా...? అంటూ ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story