Gudivada Amarnath: KCR వ్యాఖ్యలతో నేను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నాను

Gudivada Amarnath: KCR వ్యాఖ్యలతో నేను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నాను
x
Highlights

Gudivada Amarnath: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Gudivada Amarnath: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలతో తాను వ్యక్తిగతంగా వంద శాతం ఏకీభవిస్తున్నానని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

విశాఖలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అమర్నాథ్, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం పబ్లిసిటీ, మార్కెటింగ్ తప్ప మరేమీ లేదు. అభివృద్ధి శూన్యం, కేవలం ప్రచారం కోసమే ఆర్భాటాలు చేస్తున్నారు. ఈ విషయాన్నే కేసీఆర్ గారు ఎంతో స్పష్టంగా చెప్పారు" అని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ రాజకీయ శైలిని కొనియాడుతూ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ గారు ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు. మొహమాటం లేకుండా నిజాన్ని నిర్భయంగా చెబుతారు. అందుకే ఆయన దేశ రాజకీయాల్లో అంత పెద్ద నేత కాగలిగారు" అని ప్రశంసించారు. కేసీఆర్ అనుభవాన్ని, ఆయన చేసిన విశ్లేషణను తక్కువ చేసి చూడలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కన పెట్టి, కేవలం అడ్వర్టైజ్‌మెంట్లకే పరిమితమైందని అమర్నాథ్ ఆరోపించారు. కేసీఆర్ చేసిన విమర్శలను ఏపీలోని ప్రతిపక్ష నేతలు సమర్థిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories