MLA Pratap Kumar Reddy: అవినీతి కొత్త కాదు.. మేం సత్యవంతులమని చెప్పట్లేదు..

Kavali MLA Pratap Kumar Reddy Hot Comments
x

MLA Pratap Kumar Reddy: అవినీతి కొత్త కాదు.. మేం సత్యవంతులమని చెప్పట్లేదు..

Highlights

MLA Pratap Kumar Reddy: నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

MLA Pratap Kumar Reddy: నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు కొత్తకాదని, గతంలో టీడీపీ హయాంలోనూ ఇప్పటి కంటే ఎక్కువ ఆరోపణలు వచ్చాయని ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు. అవినీతి కొత్త కాదని, తామేమీ సత్యవంతులం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గతంలో టీడీపీ నేత బీద రవిచంద్ర కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ప్రతాప్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రైల్వే ట్రాక్ పనుల కోసం అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఇక పురపాలక అధికారులపై విమర్శలు వస్తున్నాయని, ఇకపై అలాంటి వాటికి తావులేకుండా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories