Kasibugga CI Suspended: సీఐ వేణుగోపాల్ సస్పెండ్

X
Highlights
Kasibugga CI Suspended: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది....
Arun Chilukuri5 Aug 2020 5:55 AM GMT
Kasibugga CI Suspended: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పలాస మండలం టెక్కలి పట్నంకు చెందిన రమేష్, జగన్ అనే యువకుల మధ్య వారి గ్రామంలో గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన జగన్ అనే దళితుడుని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో తన్నారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఏపీ డీజీపీ కార్యాలయం సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపింది. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత విశాఖ డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాలన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Web TitleKasibugga ci Venugopal suspended
Next Story