East Godavari: రాజమండ్రిలో మొదలైన కార్తీకమాస సందడి

East Godavari: తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలాచారిస్తున్న భక్తులు...

Shireesha
Published on: 5 Nov 2021 11:05 AM IST
Karthika Masam 2021 Celebrations Started in Rajahmundry East Godavari | AP Latest News
X

East Godavari: రాజమండ్రిలో మొదలైన కార్తీకమాస సందడి

East Godavari: హరిహరులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాస సందడి ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరిలో తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జిల్లాలో కోవిడ్ నిబంధనలు సడలింపుతో ఈ ఏడాది పుణ్యస్నానాలకు అధికారులు అనుమతి ఇచ్చారు.

గోదావరి స్నానఘట్టాల వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు అధికారులు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. రాజమండ్రి సహా తూర్పుగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాల్లో కార్తీక మాసోత్సవాల నిమిత్తం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసారు. పంచారామ క్షేత్రాలతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది.

Shireesha

Shireesha

Next Story