తిరుమలలో ఘనంగా కార్తీక దీపోత్సవం

దీపాల వెలుగులతో శోభిల్లిన శ్రీవారి ఆలయం

Neeta Gurnale
Published on: 30 Nov 2020 12:48 PM IST
తిరుమలలో ఘనంగా కార్తీక దీపోత్సవం
X

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం ఘనంగా జరిగింది. సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తర్వాత ఈ దీపోత్సవాన్ని టీటీడీ కన్నుల పండువగా నిర్వహించింది. తిరుమలంతట అర్చకులు దీపాలను వెలిగించారు. గర్భగుడిలోని మూలవిరాట్టుకు ప్రత్యేక హారతి సమార్పించారు. అనంతరం 100 కొత్త మూకుళ్లలో నేతి వత్తులతో దీపాలను వెలిగించుకుని పరివార ఆలయాలు, మండపాల్లో జ్యోతులను ఏర్పాటు చేశారు. దేదీప్యామానమైన దీపాల వెలుగులతో శ్రీవారి ఆలయం శోభిల్లింది. ఆద్యాంతం కన్నుల పండువగా సాగిన ఈ దీపోత్సవంలో అధికారులు, అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కార్తీక దీప మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాయంత్రం నిర్వహించే సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

Neeta Gurnale

Neeta Gurnale

Next Story