శ్రీశైలం మల్లన్న సన్నిధిలో లక్షదీపోత్సవం

Srisailam: భ్రమరాంబ సమేత మల్లన్నకు ప్రత్యేకపూజలు... లక్షదీపోత్సవం, దశహారతి నివేదనలో పులకించిన భక్తజనం.

R Tripura Malini
Published on: 1 Nov 2022 10:33 AM IST
Kartheeka Somavaram Celebrations Were Spell Bound At Srisailam
X

 శ్రీశైలం మల్లన్న సన్నిధిలో లక్షదీపోత్సవం

Kartheeka Somavaram: శ్రీశైలం మల్లన్న సన్నిధి దివ్యశోభతో అలరారింది. కార్తీక మాసపూజలతో వైభవాన్ని సంతరించుకుంది. కార్తీకమాసంలో తొలి సోమవారం లక్షదీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని అధిష్టింపజేసి సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరింపజేశారు. పుష్కరిణివద్ద ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక మాస ప్రాముఖ్యతతో గంగా హారతి సంకేతంగా దశహారతులతో ఆరాధించారు. దశహారతులను చూసి భక్తులు పులకించిపోయారు. కార్తీక మాసంలో ఆదిదంపతులను దర్శించుకోడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కార్తీక దీపారాధనలో భక్తులు భాగస్వామ్యమయ్యారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న దంపతులు, ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story