అమరావతి ఉద్యమం పచ్చి భూటకం : కరణం ధర్మశ్రీ

karanam dharmasri slams Chandrababu: అమరావతి ఉద్యమం అనేది పచ్చి భూటకమని వైసీపీ ఎమ్మెల్యే...
karanam dharmasri slams Chandrababu: అమరావతి ఉద్యమం అనేది పచ్చి భూటకమని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. 250 రోజుల ఉద్యమం అని పది మందితో ఉద్యమం నడుపుతున్నారని తెలిపారు. చంద్రబాబు చేయిస్తున్న జూమ్ ఉద్యమానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కారాల్ మర్క్స్ సిద్దాంతంకు విరుద్ధంగా సీపీఐ సీపీఎం లు వ్యవహరిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు పేరు చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చుకోవాలని హితవు పలికారు. లేని అమరావతి ఉద్యమాన్ని అంతర్జాతీయ ఉద్యమంగా ప్రచారం చేస్తున్నారు.
మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. చంద్రబాబు ప్రతిపక్ష నేతవా బ్రోకర్ వా. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తావా అని చంద్రబాబును నిలదీశారు. ఎందుకు విశాఖపట్నంపై చంద్రబాబు విషం కక్కుతున్నావు. దళితులపై ప్రేమ ఉంటే రాజధానిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎందుకు అడ్డుకున్నారు. వైజాగ్ గా రాజధానిని అడ్డుకుంటే టీడీపీ నేతలు ద్రోహులగా మిగిలిపోతారు. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో చర్యలు తీసుకోమని డిమాండ్ చేసిన రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో ఎందుకు నోరు మీదపడం లేదని ఎమ్మెల్యే కరణం ప్రశ్నించారు.