Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా ‘కాంతితో క్రాంతి’

Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమం చేపట్టింది.

Arun Chilukuri
Published on: 7 Oct 2023 7:12 PM IST
Kanthi Tho Kranthi in AP Over Chandrababu Arrest
X

Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా ‘కాంతితో క్రాంతి’

Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ పార్టీ శ్రేణులు..దీపాలు, కొవ్వుత్తులు వెలిగించి నిరసన తెలుపుతున్నారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు తెదేపా నేతలు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు లైట్లు ఆపేసి, దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. కొందరు రహదారిపై వెళ్తూ వాహనాల లైట్లు బ్లింక్‌ చేసి నిరసన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, దిల్లీలో లోకేశ్‌ దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story