Kancharla Srikanth: రాబోయే ఎన్నికల్లో‌ టిడిపి విజయం సాధిస్తుంది

Kancharla Srikanth Says TDP Will Win Upcoming Elections
x

Kancharla Srikanth: రాబోయే ఎన్నికల్లో‌ టిడిపి విజయం సాధిస్తుంది

Highlights

Kancharla Srikanth: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం ఆనందంగా ఉంది

Kancharla Srikanth: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మధరావు,ఏపి ఎస్సీ కమీషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్, టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 39 వేల మెజారిటీతో గెలవడం ఆనందంగా ఉందన్నారు టిడిపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. రాబోయే ఎన్నికల్లో‌ టిడిపి అధికారంలోకి రావాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories