దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం
x
Highlights

దసరా శరన్నవరాత్రి వేడుకలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ...

దసరా శరన్నవరాత్రి వేడుకలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈ.ఓ మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 25 వరకు ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయని అన్నారు. కోవిడ్ ద్రుష్ట్యా ఇంద్రకీలాద్రి పై పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో రోజుకు పది వేల మందిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. మూలానక్షత్రం రోజున 13 వేల మందిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని తెలిపారు.

మూల నక్షత్రం రోజున మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. భక్తులు మాస్క్ ధరిస్తేనే క్యూలైన్ లోకి అనుమతిస్తామని తెలిపారు. తొలి రోజు మినహా మిగిలిన అన్ని రోజులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుందని ఆయన అన్నారు. మూలానక్షత్రం రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. అన్ని క్యూలైన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నామని ఆయన అన్నారు. కరోనా ద్రుష్ట్యా అన్ని స్నాన ఘాట్లను మూసివేస్తున్నామని, తలనీలాలు సమర్పించేందుకు అనుమతి నిరాకరిస్తున్నామని ఆయన తెలిపారు. దసరా చివర రోజు తెప్పోత్సవానికి ఘాట్లలోకి భక్తులను అనుమతించమని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories