దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి

దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి
x
Highlights

దసరా శరన్నవరాత్రి వేడుకలకు ఇంద్రకీలాద్రి ముస్తాబ్ అవుతుంది. వినాయక గుడి వద్ద నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఒక్క సారి క్యూ లైన్ లోకి...

దసరా శరన్నవరాత్రి వేడుకలకు ఇంద్రకీలాద్రి ముస్తాబ్ అవుతుంది. వినాయక గుడి వద్ద నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఒక్క సారి క్యూ లైన్ లోకి ఎంటర్ అయితే తిరిగి అమ్మ వారి దర్శనం పూర్తి అయిన తరువాత బైటకు వచ్చేది. ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 17నుంచి 25వరకు ఆలయంలో దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే కోవిడ్ నిబంధనలు మధ్య నిర్వహించే ఈ వేడుకలు అత్యంత నిరాడంబరంగా జరుగనున్నాయి. రోజుకి కేవలం 10వేల మంది భక్తులకు మాత్రమే అనుమతించనున్నారు. అటు ఆర్జిత సేవల్లో కూడా భక్తులు పరోక్షంగా పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు 60 సంవత్సరాలు దాటినవారిని, పదేళ్లలోపు చిన్నారులను, గర్భిణీలను, హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడే వారికి ఆలయంలోకి అనుమతి నిషేధించారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే ఆలయంలోకి అనుమాతిస్తున్నారు. దర్శనాలకు ప్రత్యేక ఏర్పాటు చేసిన అధికారులు వినాయక గుడి నుంచి ఐదు కిలోమీటర్ల క్యూ లైన్ ఉంచారు. ఈ క్యూలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఆన్లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకుని అధికారులు ఇచ్చిన టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే రావాల్సి ఉంటుంది. కరోనా ఎఫెక్ట్ తో అన్నదానం మార్చి నెల నుంచి నిలుపుదల చేశారు. అన్నదానం లేకుండా ప్రసాదం ప్యాకేట్స్ రూపంలో అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories