Kalyandurgam Municipal Chairperson: కళ్యాణదుర్గం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవి టీడీపీ కైవసం

Kalyandurgam Municipal Chairperson: అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ పదవిని తెలుగుదేశం పార్టీ (TDP) కైవసం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 11 Dec 2025 12:50 PM IST
Kalyandurgam Municipal Chairperson: కళ్యాణదుర్గం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవి టీడీపీ కైవసం
X

Kalyandurgam Municipal Chairperson: అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ పదవిని తెలుగుదేశం పార్టీ (TDP) కైవసం చేసుకుంది. మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తలారి గౌతమి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నుంచి 11 మంది, తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి 11 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.

ఎన్నికలో కీలకమైన ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొన్నారు. ఛైర్‌పర్సన్‌ ఎన్నిక కోసం జరిగిన ఓటింగ్‌లో.. మొత్తం 13 మంది (11 మంది టీడీపీ కౌన్సిలర్లు + ఇద్దరు ఎక్స్‌-అఫీషియో సభ్యులు) తలారి గౌతమికి మద్దతుగా చేతులు ఎత్తి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విజయంతో కళ్యాణదుర్గం మున్సిపాలిటీపై టీడీపీ తన పట్టును నిరూపించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story