సుబ్రహ్మణ్యం హత్యపై వీడని ఉత్కంఠ.. ఇంకా లభించని ఎమ్మెల్సీ అనంతబాబు ఆచూకీ...

Kakinada: సుబ్రహ్మణ్యంది హత్యేనని పోస్టుమార్టం నివేదిక...

Shireesha
Published on: 23 May 2022 8:41 AM IST
Kakinada Subramanyam Death Mystery MLC Anantha Udaya Bhaskar Not Yet Arrested | Live News
X

సుబ్రహ్మణ్యం హత్యపై వీడని ఉత్కంఠ.. ఇంకా లభించని ఎమ్మెల్సీ అనంతబాబు ఆచూకీ...

Kakinada: కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ‌్యం హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. సుబ్రహ్మణ్యంది హత్యేనని పోస్టుమార్టం నివేదిక రావడంతో ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఆచూకీ ఇంకా దొరకలేదు. తాజా పరిస్థితిని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు సమీక్షిస్తున్నారు.

అనంతబాబును అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటించి 30గంటలు దాటిన ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని ఇవాళ నిరసన కార్యక్రమాలకు వామపక్షాలు, దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు

Shireesha

Shireesha

Next Story